Friday, July 22, 2011

జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్


1) భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమ ఏది?
1. ఇనుము, ఉక్కు 2. కాటన్ టెక్స్‌టైల్
3. చక్కెర పరిశ్రమ 4. తేయాకు ప్రాసెసింగ్
2) భారతదేశంలో అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాషలు ఏ గ్రూపునకు చెందినవి?
1. ఇండో- ఆర్యన్ 2. ద్రవిడియన్
3. ఆస్ట్రో- ఆసియాటిక్ 4. సైనో- టిబెటన్
3) మధ్య, దక్షిణ భారతదేశాలలోని గిరిజనులు ఏ గ్రూపునకు చెందిన వారు?
1. నెగ్రిటోస్ 2. ప్రోటో అస్ట్రాలాయిడ్స్
3. మంగోలాయిడ్స్
4. పశ్చిమ బ్రాచిసెఫాల్స్
4) క్రింది వారిలో మధ్యధరా ప్రజల సమూహానికి చెందినవారు ఎవరు?
1. అండమాన్ నికోబార్ దీవుల ప్రజలు
2. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల ప్రజలు
3. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల ప్రజలు
4. ఉత్తర భారతదేశంలో పర్వత మండల ప్రజలు
5) భారతదేశంలో అతి ప్రాచీనకాలం నుండి నివసిస్తున్న ప్రజలు?
1. మధ్యధరా ప్రజలు 2. నిగ్రోయిట్లు
3. నార్డిక్స్ 4. మంగోలాయిడ్లు
6) అంగామి తెగల ప్రజలు ఏ రాష్ట్రంలో ఉంటారు?
1. మధ్యప్రదేశ్ 2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు 4. నాగాలాండ్
7) తోడా తెగ ఏ రాష్ట్రానికి చెందినది?
1. మధ్యప్రదేశ్ 2. తమిళనాడు
3. రాజస్థాన్ 4. అరుణాచల్‌ప్రదేశ్
8) మొఫ్లాలు ఎవరు?
1. మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజనులు
2. అస్సాంకు చెందిన గిరిజనులు
3. కేరళకు చెందిన ముస్లింలు
4. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గిరిజనులు
9) బర్హోరులు ఎక్కడ నివసిస్తున్నారు?
1.జార్ఖండ్ 2. అసోం
3. నాగాలాండ్ 4. తమిళనాడు
10) భారతదేశంలో ఉన్న గ్రామాల సంఖ్య ఎంత?
1. సుమారు 3.8 లక్షలు
2. సుమారు 5.6 లక్షలు
3. సుమారు 10.0 లక్షలు
4. సుమారు 4.9 లక్షలు
11) అత్యధిక సంఖ్యలో పట్టణ యూనిట్లు కలిగిన రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2. మహారాష్ట్ర
3. ఉత్తరప్రదేశ్ 4. పశ్చిమబెంగాల్
12) ఆవాసాలు లేని, గ్రామాలు లేని రాష్ట్రంగా ప్రసిద్ధి చెందినది?
1. ఉత్తరప్రదేశ్ 2. కేరళ
3. పశ్చిమ బెంగాల్ 4. తమిళనాడు
13) సెన్సస్ ఆఫ్ ఇండియా ఒక ప్రదేశాన్ని పట్టణంగా పరిగణించాలంటే క్రింది వాటిలో అవసరంలేనిది ఏది?
1. మొత్తం జనాభా 10వేల కంటే ఎక్కువగా ఉండాలి.
2. మొత్తం జనాభా ఐదువేల కంటే ఎక్కువగా ఉండాలి, 3. జనసాంద్రత చ.కి.మీ.కు 400 మంది కంటే ఎక్కువ ఉండాలి, 4. పనిచేస్తున్న పురుషుల్లో 75 శాతానికి పైగా పురుషులు వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి
14) క్రింది వాటిలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది?
1. గ్రేటర్ ముంబై 2. ఢిల్లీ
3. కోల్‌కతా 4. చెన్నై
15) మొత్తం ప్రపంచ జనాభాలో ఆసియాలో నివసిస్తున్న జనాభా శాతం?
1. సుమారు 30 శాతం
2. సుమారు 45 శాతం
3. సుమారు 55 శాతం
4. సుమారు 65 శాతం
16) అత్యధిక సంఖ్య కలిగిన జాతి సమూహం ఏది?
1. నీగ్రోయిడ్ 2. మంగోలాయిడ్
3. అస్ట్రాలాయిడ్ 4. కౌకాసాయిడ్
17) సముద్ర జలాల్లో సమృద్ధిగా లభించే మూలకం ఏది?
1. సోడియం 2. క్లోరిన్
3. అయోడిన్ 4. పొటాషియం
18) శివాలిక్ కొండల పశ్చిమ హద్దు ఏది?
1. పిర్ పంజాల్ 2. పొత్తార్ హరివాణం
3. కోసి నది 4. మోర్ని కొండలు
19) తూర్పునుండి పశ్చిమానికి గరిష్టంగా విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి?
1. కుమయూన్ హిమాలయాలు
2. అస్సాం హిమాలయాలు
3. పంజాబ్ హిమాలయాలు
4. నేపాల్ హిమాలయాలు
20) ఆరావళి పర్వతాల్లో పుట్టి గల్ఫ్ ఆఫ్ కాంబేలోకి ప్రవహించే నది ఏది?
1. లుని 2. సబర్మతి
3. సాహిబి 4. నేత్రావతి
21) కార్డమోమ్ కొండలకు గల మరొక పేరేమిటి?
1. పళని కొండలు 2. నీలగిరి కొండలు
3. యేలగిరి కొండలు
4. అన్నామలై కొండలు
22) ఉపరితలంపై సేంద్రియ పదార్థం పోగుపడే మృత్తిక రకం ఏది?
1. పీటి నేలలు 2. అల్లువియల్ నేలలు
3. లాటరైట్ నేలలు 4. ఎర్ర నేలలు
23) నీరు నిలబడకుండా అధిక వర్షపాతం అవసరమైన పంట ఏది?
1. వరి 2. జనుము
3. తేయాకు 4. వేరుశనగ
24) ఆంగ్లో- సుబియాన్ దేనికి సంబంధించిన సంకర జాతి?
1. గొర్రెలు 2. మేకలు
3. కోళ్లు 4. పశువులు
25) 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత?
1. 261 2. 276
3. 324 4. 269
26) జనాభానుబట్టి క్రింది రాష్ట్రాలను సరైన ఆరోహణా క్రమంలో అమర్చండి..
1. ఉత్తరప్రదేశ్ 2. పశ్చిమ బెంగాల్
3. మధ్యప్రదేశ్ 4. మహారాష్ట్ర
1. 1,2,3,4 2. 1,3,4,2
3. 1,2,4,3 4. 1,4,2,3
27) జనసాంద్రతను బట్టి క్రింది రాష్ట్రాలను సరైన అవరోహణా క్రమంలో అమర్చండి..
1. కేరళ 2. ఉత్తరప్రదేశ్
3. బీహార్ 4. పశ్చిమ బెంగాల్
1. 1,4,2,3 2. 4,2,1,3
3. 4,1,2,3 4. 1,4,3,2
*
జవాబులు
1) 2, 2) 1, 3) 2, 4) 3, 5) 2, 6) 4, 7) 2, 8) 3, 9) 1, 10) 2, 11) 3, 12) 2, 13) 1, 14) 1, 15) 3, 16) 4, 17) 2, 18) 2, 19) 4, 20) 2, 21) 3, 22) 1, 23) 3, 24) 2, 25) 3, 26) 4, 27) 2.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers