Sunday, July 3, 2011

జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్


1) భారతదేశంలో చెరకు పంట ఎంత కాలానికి కోతకు వస్తుంది?
1. 5 నెలలు 2. 3 నెలలు 3. 7నెలలు 4. 12నెలలు
2) జనపనారను మొక్కలోని ఏ భాగం నుండి తీస్తారు?
1. పువ్వు 2. కాయ 3. కాండం 4. ఆకు
3) కాఫీ మొక్కలోని ఏ భాగంనుండి వస్తుంది?
1. గింజలు 2. పువ్వు 3. కాండం 4. ఆకు
4) భారతదేశంలో సహజ రబ్బరును పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2. కర్నాటక 3. ఆంధ్రప్రదేశ్ 4. కేరళ
5) రబ్బరు సాగుకు అవసరమైన ఉష్ణోగ్రత ఎంత?
1. సుమారు 25 డిగ్రీల సెల్సియస్
2. సుమారు 30 డిగ్రీల సెల్సియస్
3. సుమారు 35 డిగ్రీల సెల్సియస్
4. సుమారు 45 డిగ్రీల సెల్సియస్
6) భారతదేశపు ‘చక్కెర గినె్న’ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
1. ఉత్తరప్రదేశ్ 2. పంజాబ్
3. ఆంధ్రప్రదేశ్ 4. బీహార్
7) క్రింది వాటిలో ఖరీఫ్ సీజన్‌లో పండని పంటలు ఏవి?
1. సజ్జ, వరి 2. మొక్కజొన్న, జొన్న
3. బార్లీ, ఆముదం 4. జొన్న, వరి
8) మిరియాల మొక్క...
1. వృక్షం 2. తీగల పాదు
3. పొద 4. ముళ్లపొద
9) జనపనార సాగు పశ్చిమ బెంగాల్‌లో అధికంగా కేంద్రీకృతం కావడానికి కారణం కానిది ఏది?
1. నేల చదునుగా ఉండటం
2. అల్లువియల్ నేల
3. నీటి లభ్యత 4. మూలధన లభ్యత
10) ఎర్ర మిర్చిని అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. ఆంధ్రప్రదేశ్
3. రాజస్థాన్ 4. కర్నాటక
11) కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తయ్యే రాష్ట్రం ఏది?
1. ఉత్తరప్రదేశ్ 2. తమిళనాడు
3. జమ్మూ-కాశ్మీర్ 4. కేరళ
12) అల్లం అధికంగా ఉత్పత్తిచేసే దేశం ఏది?
1. పంజాబ్ 2. హర్యానా
3. కేరళ 4. మధ్యప్రదేశ్
13) అత్యధిక పశుసంపద కలిగిన రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. హర్యానా
3. మధ్యప్రదేశ్ 4. తమిళనాడు
14) ‘ఆపరేషన్ ఫ్లడ్’ దేనికి సంబంధించినది?
1. వరద నియంత్రణ
2. సాగునీటి సౌకర్యాల కల్పన
3. ఆహార ధాన్యాలను పెద్దఎత్తున నిల్వచేయడం 4. నగరాలలో పాల లభ్యతను మెరుగుపరచడం
15) గొర్రెలు, మేకలు అధిక సంఖ్యలో గల రాష్ట్రం ఏది?
1. జమ్మూ-కాశ్మీర్ 2. రాజస్థాన్
3. ఉత్తరప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
16) భారతీయ సముద్రపు ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రధానమైంది ఏది?
1. రొయ్యలు 2. వేల్ ఆయిల్
3. పీతలు 4. ఎండ్రకాయలు
17) రెజిన్ అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్ 2. మధ్యప్రదేశ్
3. కర్నాటక 4. హిమాచల్‌ప్రదేశ్
18) భారతదేశంలో సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రధాన కారణం?
1. వర్షపాత పరిమాణం తక్కువగా ఉండటం 2. పంటల సాగుకోసం
3. వర్షపాతం అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా లేకపోవడం
4. వర్షపాతం సమయానుకూలంగా లేకపోవడం
19) మొత్తం సాగు భూమిలో అత్యధిక సాగుభూమికి సాగునీటి సౌకర్యం కలిగిన రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. తమిళనాడు
3. ఉత్తరప్రదేశ్ 4. హర్యానా
20) అత్యధిక శాతం భూమికి సాగునీటి సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1. హర్యానా 2. ఉత్తరప్రదేశ్
3. మహారాష్ట్ర 4. పంజాబ్
21) చెరువుల కింద అత్యధిక సాగు భూమి కలిగిన రాష్ట్రం?
1. తమిళనాడు 2. ఒరిస్సా
3. పశ్చిమ బెంగాల్ 4. కర్నాటక
22) మొత్తం సాగు భూమిలో సాగునీటి కాలువల అధిక భూమి కలిగిన రాష్ట్రం?
1. ఉత్తరప్రదేశ్ 2. పంజాబ్
3. హర్యానా 4. జమ్మూ-కాశ్మీర్
23) మొత్తం సాగు భూమిలో అత్యధిక శాతం భూమి బావుల కింద ఉన్న రాష్ట్రం ఏది?
1. హర్యానా 2. బీహార్ 3. గుజరాత్
4. పశ్చిమ బెంగాల్
24) నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1. కృష్ణా నది 2. గోదావరి నది
3. కావేరీ నది 4. తపతి నది
25) ధవరన్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. గుజరాత్ 4. ఆంధ్రప్రదేశ్
26) కొయానా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలలో ఒకటి?
1. వరద నియంత్రణ 2. జల విద్యుత్ ఉత్పత్తి 3. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
4. వన్యప్రాణి సంరక్షణ
27) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3. ఆంధ్రప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
28) తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ రాష్ట్రాల మధ్య ఉంది?
1. కర్నాటక, మధ్యప్రదేశ్
2. ఒరిస్సా, మధ్యప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్, కర్నాటక
4. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
29) రాజస్థాన్ కెనాల్ (ఇందిరాగాంధీ కెనాల్) ఏ నది నుండి ప్రారంభమవుతుంది?
1. రావి 2. చంబల్
3. సట్లెజ్ 4. బియాస్
*
జవాబులు:
1) 3, 2) 3, 3) 1, 4) 4, 5) 3, 6) 1, 7) 3, 8) 2, 9) 4, 10) 2, 11) 3, 12) 3, 13) 3, 14) 4, 15) 2, 16) 1, 17) 4, 18) 4, 19) 3, 20) 4, 21) 1, 22) 1, 23) 3, 24) 1, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 3,

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...

Followers