Monday, June 13, 2011

జనరల్ నాలెడ్జ్-6


1) ఖండ పర్వతాలు ఏర్పడటానికి కారణం?
1. వళత్వము 2. భ్రంశము 3. వళత్వము, భ్రంశము 4. పురాతన పర్వతాల క్రమక్షయము
2) ముడుత పర్వతములనగా?
1. కనబడునట్లుగా బయట ముడుతలున్న పర్వతములు 2. లోపల ముడుత రాళ్ళున్న పర్వతములు 3. చుట్టూ లోయలున్న పర్వతములు
4. గొలుసులా తయారైన ప్రపంచ పర్వతములు
3) సహజ కారణములవల్ల రాళ్ళు అరుగు తరుగులను ఏమందురు?
1. క్రమక్షయము 2. వికోషీకరణము
3. ఆకురాలుట 4. అవక్షేప కారణము
4) ప్రపంచంలోని అన్నింటికన్నా ఎత్తయిన శిఖరము వౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ వున్నది?
1. నేపాల్ 2. భారతదేశము 3. భూటాన్ 4. చైనా
5) వీటిలో ఏ నదులు దోష రేఖల ద్వారా ప్రవహించును?
1. మహానది మరియు బ్రహ్మపుత్ర
2. క్రిష్ణ మరియు కావేరి 3. గంగ మరియు యమున 4. నర్మద మరియు తపతి
6) వజ్రము ఒక విధమైన...
1. అవక్షేప శిల 2. రూపాంతరమొందిన రాయి
3. అగ్ని రాయి 4. అగ్ని పర్వతపు భస్మము
7) నదులలో వికోషీకరణము ఎచ్చట జరుగును?
1. సమతల ప్రదేశములలో 2. కొండలలో 3. పరివాహక ప్రదేశములలో 4. నది ముఖ ద్వారములో
8) ‘‘మాగ్మా’’ ఒక...
1. అగ్నిశిల 2. శిథిలమైన లావా
3. శిలా ద్రావకము 4. కరిగిన లావా
9) భూమధ్యరేఖ వర్షపుటడవుల ప్రాంతంలోని మృత్తికలు...
1. లేటరైట్స్ 2. పోడ్ జోల్స్
3. చెర్నోజెమ్స్ 4. వండలి నేలలు
10) శిలాజములలో ముఖ్యంగా కనిపించేది ఏది?
1. రూపాంతర శిల 2. మంచుగడ్డ
3. అవక్షేప శిల 4. అగ్నిశిల
11) శైథిల్యమనగా...?
1. మానవ జీవితంపై వాతావరణ ప్రభావము
2. శిలలు స్వాభావికంగా కృశించి కరిగిపోవుట
3. క్రమంగా నదులచే మృత్తిక క్షీణించుట
4. భూమి ఉపరితలంపై వదులైన పదార్థం రవాణా కాబడి నిక్షేపించబడటం
12) డైకులు లేక సముద్రపు గోడలు ఉన్న దేశం?
1. బెల్జియం 2. హాలండ్ 3. జపాను 4. జర్మనీ
13) సునామీ అనగా...?
1. భూకంపంవల్ల కలిగిన వేలా తరంగం
2. కొద్దిపాటి భూకంపం
3. ఒక రకమైన ప్రవాళ ద్వీపము
4. సుమత్రా వాస్తవ్యులు
14) రిక్టర్ స్కేలుతో కొలుచునది?
1. నీటి ప్రవాహము 2. హిమనీ నదముల చలనము 3. గాలి వేగము 4. భూకంప తీవ్రత
15) సజీవ శిలాజము ప్రాంతం ఏది?
1. ఆస్ట్రేలియా 2. అర్జంటీనా 3. మెక్సికో 4. ఆఫ్రికా
16) ముడుత పర్వతములు ఏర్పడుటకు కారణము?
1. సమతల తన్యత బలము 2. సమతల సంపీడన బలము 3. ఊర్ధ్వ చలనము 4. పునరావృతమగు ముడుతలు
17) భూమిపై అతి పెద్ద సముద్ర హరివాణము?
1. అట్లాంటిక్ మహాసముద్రము
2. పసిఫిక్ మహాసముద్రము
3. హిందూ మహాసముద్రము
4. ఆర్కిటిక్ మహాసముద్రము
18) క్రేటర్ సరస్సు దేనివలన ఏర్పడును?
1. అగ్నిపర్వతముల చర్య 2. వికోషీకరణం
3. పల్లపు ప్రాంతంలో నిలిచిన వర్షపు నీరు
4. భూకంపాలు
19) స్టాలాక్‌టైట్ అనగా?
1. సున్నపురాయి గుహనుండి వ్రేలాడునట్టి ఖనిజ పదార్థ పంక్తి
2. సున్నపురాయి గుహ అడుగున ఏర్పడిన ఖనిజ పదార్థ పంక్తి
3. సముద్రపు నీటి తాకిడి వలన అరిగిన రాళ్ల పంక్తి
4. అగ్నిపర్వతములవల్ల ఏర్పడిన విక్షేపముల పంక్తి
20) పక్షి అడుగు (బర్డ్ఫుట్) ఆకారంలో ఉండే డెల్టా ఏది?
1. మిస్సిసిపి డెల్టా 2. సింధూ డెల్టా 3. ఓబ్ డెల్టా 4. గంగా డెల్టా
21) మబ్బులతో కూడిన రాత్రులు మబ్బులు లేని రాత్రులకంటే చల్లగా ఉండడానికి గల కారణం క్రింది వాటిలో ఏది?
1. ఆకాశంనుండివచ్చే చల్లని గాలులని మేఘాలు ఆపడం.
2. భూమి నుండి వచ్చే వేడిని తిరిగి పరావర్తనం చెందించడం
3. ఉష్ణాన్ని సృష్టించి భూమిపైకి పంపడం
4. వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి భూమిపైకి పంపడం
22) మునిగిపోయిన నదుల ముఖ ద్వారాల వద్ద ఏర్పడే డెల్టాలను ఏమంటారు?
1. వక్రత 2. ఎస్ట్యువరీ 3. 1, 2 4. ఏదీ కాదు
23) ఎస్ట్యువరీ డెల్టాలకు ఉదాహరణలు ఏవి?
1. ఓబ్‌డెల్టా 2. ఎల్బ్‌డెల్టా 3. విస్తులా డెల్టా 4. పైవన్నీ
24) వరద మైదానాలు ఏ నదీ దశలో ఏర్పడతాయి?
1. తరుణ దశ 2. ప్రౌఢ దశ 3. వృద్ధ దశ 4. ఏదీ కాదు
25) పాయలు ఏ నదీ దశలో ఏర్పడతాయి?
1. తరుణ దశ 2. ప్రౌఢ దశ 3. వృద్ధ దశ 4. ఏదీ కాదు
26) కింది పేర్కొన్న స్థలాల్లో ఏయే స్థలాల వరకూ బెర్ముడా ట్రయాంగిల్ విస్తరించి ఉంది?
ఎ. దక్షిణ ఫ్లోరిడా బి. పూర్టారికో సి. హవాయి దీవులు కింద ఇచ్చిన సంకేతాన్ని ఉపయోగించుకొని సరయిన సమాధానం ఎంపిక చేయండి.
1. ఎ,బి,సి 2. ఎ,బి 3. బి,సి 4. ఎ,సి
27) త్రిభుజం ఆకారంలో ఉండే డెల్టాలు ఏవి?
ఎ. గంగా డెల్టా బి. నైలు డెల్టా సి. మెకాంగ్ డెల్టా డి. సింధూ డెల్టా
1. ఎ,సి మాత్రమే 2. బి,సి మాత్రమే 3. పైవన్నీ 4. ఏదీ కాదు
28) జెట్ స్ట్రీములు ఉండే ప్రదేశము ఏది?
1. స్ట్రాటోపాజ్ 2. స్ట్రాటో ఆవరణం 3. ట్రోపోపాజ్ 4. ట్రోపో ఆవరణం
29) సౌర స్థిరాంకం అనునది ఏది?
1. 1.96 కేలరీ 2. 1.9 కేలరీ 3. 1.90 కేలరీ 4. 1.94 కేలరీ
30) డోల్‌డ్రమ్ అని దేనిని అంటారు?
1. ధ్రువాల వద్ద గల అల్పపీడన మేఖల
2. భూమధ్య రేఖా అల్పపీడన మండలం
3. ఉపధ్రువ మండలాలవద్దగల అల్పపీడన మేఖల 4. ఉప ఆయన రేఖ మండలాల వద్దగల అల్పపీడన మేఖల
31) భ్యూఫోర్టు స్కేలును ఏ వేగాన్ని కొలుచుటకు వాడతారు?
1. మహాసముద్ర ప్రవాహాలు 2. పవనాలు 3. ప్రవహించే నీరు 4. భూప్రకంపనలు. *
జవాబులు:
1) 2, 2) 1, 3) 1, 4) 1, 5) 4, 6) 1, 7) 3, 8) 3, 9) 1, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 4, 15) 1, 16) 2, 17) 2, 18) 1, 19) 1, 20) 1, 21) 2, 22) 2, 23) 2, 24) 2, 25) 2, 26) 3, 27) 2, 28) 3, 29) 4, 30) 2, 31) 2.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers