Tuesday, June 14, 2011

జనరల్ నాలెడ్జ్-8


1) అత్యధిక ప్రపంచ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదు అవుతుంది?
1. ఆల్ అజీజియ 2. జాంజిబార్ 3. వాస్టర్ 4. వయలిలీ
2) ‘బుష్‌మెన్’ అను తెగ ఎక్కువగా ఎక్కడ
కేంద్రీకరింపబడి వున్నది?
1. నామిచ్ ఎడారి 2. కాంగో హరివాణం
3. సహారా ఎడారి 4. కలహారి ఎడారి
3) జాంబియా, జింబాబ్వేలను వేరుచేస్తున్న
జలపాతం ఏది?
1. విక్టోరియా జలపాతం 2. ఎంజెల్ జలపాతం 3. నయాగరా జలపాతం 4. ఏదీకాదు
4) పలకరాయి క్రింది ఏ శిల రూపాంతరం చెందగా ఉద్భవిస్తుంది?
1. సున్నపురాయి 2. గ్రానైట్ 3. మైకా 4. క్లే
5) హిమగర్తలు ఏర్పడుటకు ఇది కారణం...
1. నది 2. హిమానీ నదము 3. గాలి 4. ఉష్ణోగ్రత
6) వీ- ఆకారపు లోయ దేనివలన ఏర్పడుతుంది?
1. నది 2. హిమానీనదములు 3. పవనాలు 4. భ్రంశోద్ధిత శిలావిన్యాసం
7) ఎడారి ప్రాంతంలో ఏర్పడే సరస్సులను ఏమంటారు?
1. ఆక్స్-బో సరస్సు 2. ప్లయాలు 3. ఫ్లోరిన్స్ 4. వైఫ్స్
8) రెండు సమాన అక్షాంశాల మధ్య ప్రాంతంలో కదలికవల్ల భూభాగం పైకి లేచి ఏర్పడే
శిలారూపాన్ని ఏమంటారు?
1. అపవళి 2. వళి 3. భ్రంశోద్ధితా శిలావిన్యాసం 4. అభినతి
9) ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది ఏది?
1. గ్లేసియర్- హిమము
2. డెల్టా - నదీ నిక్షేపము
3. బార్ఖాన్- పవన నిక్షేపం
4. సముద్ర గుహ- తరంగ నిక్షేపం
10) సరస్సులు పూడుకుపోయి ఏర్పడే
మైదానాలను ఏమంటారు?
1. పర్వతీయ మైదానం 2. సరోవర మైదానం
3. పర్వత పాద మైదానాలు
4. పీఠభూమి మైదానాలు
11) ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది పవన
క్రమక్షయానికి సంబంధించినది?
1. రాపిడి 2. అపదళనం
3. గుంతలు చేయుట 4. భక్షణ
12) హిమాలయాలు ఈ క్రింది తరగతులకు చెందిన పర్వతాలు...
1. ప్రాచీన భ్రంశ 2. తరుణ భ్రంశ
3. ప్రాచీన ముడుత 4. తరుణ ముడుత
13) స్వాభావిక తినె్న దేనివలన ఏర్పడుతుంది?
1. హిమశైల వికోషీకరణం
2. వాత వికోషీకరణం
3. తరంగ వికోషీకరణం
4. నదీ వికోషీకరణం
14) ‘పవన వేగమును’ దేనితో కొలుస్తారు?
1. బారోమీటర్ 2. అనిమోమీటర్
3. అమీటర్ 4. మానోమీటర్
15) ఉరుములు, మెరుపులతో కూడిన
వర్షమునకు కారణమయ్యే మేఘాలు ఏవి?
1. సిర్రస్ 2. నింబస్
3. క్యూములోనింబస్ 4. స్ట్రాటస్
16) భూమధ్య రేఖకు ఉత్తరాన ఇరువైపులా 300-450 అక్షాంశముల మధ్య వ్యాపించి, ధృవాలవైపు సంవత్సరం పొడవునా వీచే పవనాలను ఏమంటారు?
1. తూర్పు పవనాలు 2. పశ్చిమ పవనాలు
3. వ్యాపార పవనాలు 4. ధృవ పవనాలు
17) ‘ఇన్‌సెల్‌బర్గ్’ అనునది ఈ క్రింది వాటిలోని ఒకదాని వికోషీకరణ క్రియ...
1. నది 2. గాలి 3. భూగర్భజలము
4. హిమశైలము.
18) వండలి నిలువలో లభించే ఖనిజాలు ఏవి?
1. రాగి 2. టిన్ 3. వెండి 4. అభ్రకం
19) ఈ క్రింది వాటిలో ఏ శిల చలువ
రాయిగా మారుతుంది?
1. గ్రానైట్ 2. పియాట్ 3. షెల్ 4. సున్నపురాయి
20) ఉష్ణ జలపు ఊటలుగల ప్రాంతం?
1. అరేబియా 2. ఐస్‌ల్యాండ్ 3. సహారా 4. బర్మా
21) ‘రివర్ కాప్చర్’ అనునది దీని యందలి
సర్వసామాన్య లక్షణం...
1. నది యొక్క యవ్వన దశ
2. నది యొక్క పరిపక్వ దశ
3. నది యొక్క వార్థక్య దశ
4. నది యొక్క జన్మ దశ
22) ఘనత చెందిన హిమాలయాలు
ఈ తరగతికి చెందినవి..
1. ప్రాచీన ముడుత పర్వతాలు
2. ఖండ పర్వతాలు
3. నూతన ముడుత పర్వతాలు
4. అగ్నిపర్వతాలు
23) అగ్ని వలయముగల ప్రాంతం ఏది?
1. ఆర్కిటిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. పసిఫిక్ మహాసముద్రం
4. హిందూ మహాసముద్రం
24) పెవిప్లేన్స్ అనగా...?
1. కోత మైదానాలు 2. తీర మైదానాలు 3. అవక్షేప మైదానాలు 4. భూస్వరూప మైదానాలు
25) దేనిని హంబోల్ట్ ప్రవాహమందురు?
1. బ్రెజీలియన్ ప్రవాహము
2. పశ్చిమ ఆస్ట్రేలియన్ ప్రవాహము
3. లాబ్రడార్ ప్రవాహము
4. పెరూ ప్రవాహము
26) భూభాగముతో పోల్చినపుడు జలభాగము?
1. తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది
2. తొందరగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది
3. నిదానంగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది
4. నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది
27) ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండే నేలలు?
1. ఒండ్రుమట్టి నేలలు 2. నల్లరేగడి నేలలు
3. లేటరైటు నేలలు 4. ఎర్ర నేలలు
28) ఎడారి నేలల రంగు?
1. నలుపు 2. బూడిద 3. ఎరుపు 4. పసుపు
29) నైస్ శిలలు సామాన్య నామము?
1. రూపాంతర ప్రాప్తశిలలు
2. ద్వీప శిలలు
3. శంక్వాకార కొండలు 4. ఖనిజములు
30) కాల్డెరాకు సంబంధించినది?
1. శంక్వాకార కొండ 2. అగాధ కేంద్ర గుండము
3. ద్వీపము 4. డెల్టా
31) అగాధదరులు అనునది?
1. ఏటవాలు గోడ రూపురేఖలు
2. ‘ఏ’ వంటి ఆకృతులు
3. జలపాతములు 4. శిథిలములు
32) సముద్రపు అట్టడుగు ఇసుకను తీరమునకు సమాంతరంగా ప్రవహింపచేసే నీటి ప్రవాహ విధానమును... అని అందురు...
1. తీర ప్రవాహము 2. దీర్ఘతీర ప్రవాహము
3. ప్రతిక్షిప్త జలము 4. ఉత్థవనము
33) ఈ పీఠభూమి ప్రపంచ పై కప్పు అని పేరెన్నిక గన్నది?
1. టిబెట్టు పీఠభూమి 2. అరేబియన్ పీఠభూమి
3. దక్కన్ పీఠభూమి
4. మంగోలియన్ పీఠభూమి. *
జవాబులు:
1) 1, 2) 4, 3) 2, 4) 4, 5) 2, 6) 1, 7) 2, 8) 3, 9) 4, 10) 2, 11) 1, 12) 4, 13) 1, 14) 2, 15) 3, 16) 2, 17) 2, 18) 4, 19) 4, 20) 2, 21) 4, 22) 3, 23) 3, 24) 1, 25) 4, 26) 4, 27) 3, 28) 2, 29) 1, 30) 2, 31) 1, 32) 1, 33) 1.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers