Wednesday, June 29, 2011

జనరల్ స్టడీస్ -9

* దేశంలో తొలిసారిగా రాజ్యసభ అభిశంసనలను ఎదుర్కొన్న హైకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎవరు?
- కర్నాటక హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దినకరన్. ప్రస్తుతం ఆయనను బదిలీ చేశారు.
* జవహర్‌లాల్ నెహ్రూ పురస్కారాన్ని అందుకున్న ఐస్‌లాండ్ అధ్యక్షుడు ఎవరు?
- ఐస్‌లాండ్ అధ్యక్షుడు ఓలాఫర్ రాగ్నార్
* వజ్రపుటుంగరం ఆకృతిలో సూర్యగ్రహణం ఇటీవల ఎపుడుసంభవించింది?
- జనవరి 15
* అత్యంత తీవ్రమైన భూకంపం గత వారం ఏ దేశంలో సంభవించింది?
- హైతీ
* దక్షిణ ధృవం వరకూ ప్రయాణించిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు?
- రీనా కౌషాల్ ధర్మశక్తు
* భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరుగుతోంది?
- చెన్నై. దీనికి 22 దేశాల నుండి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
* మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు?
- మహ్మద్ నషీద్
* కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎవరు?
- ఆనంద్‌శర్మ
* దేశీయంగా తయారుచేస్తున్న తేలికపాటి యుద్ధవిమానం పేరేమిటి?
- తేజాస్.
* ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన, అతిపెద్ద నమోదిత కంపెనీల జాబితాను ఫోర్బ్సు ప్రకటించగా అందులో భారతీయ కంపెనీలు ఎన్నింటికి అవకాశం దక్కింది?
- 56కంపెనీలు. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు ఉన్నాయి.
* ఆపరేషన్ రక్షక్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ఏమిటి?
- తీరప్రాంతాల భద్రత, గస్తీని పెంచడానికి ఆకస్మిక తనిఖీలు
* ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారం దక్కించుకున్న వ్యాపారవేత్త ఎవరు?
- సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా
* అమెరికాలోని ఏ యూనివర్శిటీ అంబేద్కర్ పీఠాన్ని ఏర్పాటు చేసింది?
- అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీ అంబేద్కర్ 120వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్శిటీలో అంబేద్కర్ న్యాయ పీఠం ఏర్పాటు చేసింది.
* ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర గర్భ అగ్ని పర్వత బిలాన్ని ఎక్కడ కనుగొన్నారు?
- కరేబియన్ సముద్రంలోని జమైకా, కేమాన్ ఐలాండ్స్ మధ్యలో కనుగొన్నారు.
* పులిట్జర్ బహుమతి తొలిసారిగా ఒక ఆన్‌లైన్ సంస్థకు దక్కింది దాని పేరు ఏమిటి?
- ప్రొపబ్లికా అనే ఆన్‌లైన్ సంస్థకు దక్కింది.
* ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు?
- జిఎం రావు
* జాతీయ సివిల్ సర్వీసెస్ డేను ఏ రోజున నిర్వహిస్తున్నాం?
- ఏప్రిల్ 21
* జాతీయ పుస్తక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నాం?
- ఏప్రిల్ 23
*ప్రతిష్టాత్మకమైన డాన్ డేవిడ్ బహుమతి ఎవరికి లభించింది?
- ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత అమితావ్ ఘోష్‌కు లభించింది. ఈ అవార్డు కింద లభించే 10 లక్షల డాలర్లను ఈయన ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త గోర్టాన్ మూర్‌తో కలిసి పంచుకుంటారు.
* దేశంలోని ప్రజలందరికీ 16 అంకెల విశిష్ట గుర్తింపుసంఖ్యకు ఏం పేరు పెట్టారు?
- ఆధార్.
* యురోపియన్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు?
- యురోపియన్ యూనియన్ తొలి అధ్యక్షుడిగా బల్గేరియా ప్రధానమంత్రి హెర్మన్ వాన్ రోంపుయ్ ఎన్నికయ్యారు. ఇయుకు చెందిన విదేశీ వ్యవహారాలు, భద్రతా వ్యవహారాల కమిషనర్‌గా అత్యున్నత స్థానానికి బ్రిటన్‌కు చెందిన కాథరిన్ ఆస్టిన్ ఎంపికయ్యారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers