చరిత్రలో తొలి ‘గుహాలయాలు’ జైనులచే నిర్మించబడినవి. ఒరిస్సాలోని స్కందగిరి, కుమారగిరి గుహాలయాలు శ్రావణ బెళగొళలోని ఇంద్రగిరి, చంద్రగిరి ఆలయాలు, బాదామి, సిత్తన్నవాసల్ గుహాలయాలు జైనులచే రూపొందించబడ్డాయి.‘సాహిత్య’పరముగానూ ఇరు మతాలు గొప్ప సేవలందించాయి. ముఖ్యంగా బౌద్ధం పాళి మరియు సంస్కృతం అభివృద్ధిచెందడానికి తోడ్పడ్డది. సంస్కృతంలో తొలి కావ్యమైన బుద్ధచరిత్రను అశ్వఘోష రచించాడు. ఆచార్య నాగార్జున తన విస్తృతమైన రచనలతో సంస్కృత భాషాభివృద్ధికి తోడ్పడ్డాడు. వసుబంధు సంస్కృతంలో బౌద్ధతత్వంపై మొట్టమొదటి నిఘంటువు ‘అభిదమ్మకోశము’ను రచించాడు. దిగ్నాగుడు మరియు ధర్మకీర్తిలు బౌద్ధ సాహిత్యంలో తర్కమును ప్రవేశపెట్టారు. అదే విధంగా జైనము ప్రాంతీయ భాషలైన అర్ధమాగధి ప్రస్తుత బీహారి, కానరసి (ప్రస్తుత కన్నడ భాష) మరియు సౌరసేని (ప్రస్తుత మరాఠి) అభివృద్ధికి తోడ్పడినది. జైన గ్రంథాలన్నీ ప్రాకృతంలోనే లిఖించబడ్డాయి.
విద్యారంగ వ్యాప్తికి ఇరు మతాలు గొప్ప కృషిచేశాయి. ముఖ్యంగా బౌద్ధం శ్రీ పర్వత, నలంద, విక్రమశిల ఉద్దండపుర మరియు జగద్దల విశ్వవిద్యాలయాల స్థాపనకు కారణమైనది. అదే విధంగా జైనము ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తొలి విద్యాలయాల స్థాపనకు కృషి చేసినది.
‘సాంస్కృతిక పరంగా’ భారతీయ సంస్కృతి ఆగ్నేయ ఆసియా దేశాలకు విస్తరించడంలో ఇరు మతాలు కృషిచేశాయి. కుమారజీవ బౌద్ధంను మొట్టమొదటిసారిగా చైనాలో ప్రవేశపెట్టగా, విజయసింఘవ సింహళంలో బౌద్ధంను తొలిసారిగా ప్రవేశపెట్టాడు. అశ్వఘోషుడు, కనిష్కుడు బౌద్ధంను మధ్య ఆసియాలో వ్యాప్తిచేసి భారతదేశ సంస్కృతిక సంబంధాలను పటిష్టపరిచారు.
‘రాజకీయ రంగం’లోనూ బౌద్ధజైనములు తమ సేవల ద్వారా ఉనికిని చాటుకున్నవి. ‘శ్రేయోరాజ్యం’అనే భావన బౌద్ధతత్వం నుండే వచ్చినది. గొప్ప పాలకులైన అశోక, హర్షవర్ధన, బౌద్ధంచే ప్రభావితులైనారు.
‘ఆర్థికరంగం’లో వ్యాపార, వాణిజ్యములు విస్తరించడానికి కూడా ఇరు మతాలు కారణమైనాయి. ముఖ్యంగా జైనులు వృత్తిపరంగా వ్యాపారానే్న ఎంచుకున్నారు. బౌద్ధంయొక్క చొరవతో తీర ప్రాంతాలలోని, పట్టణాలు వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
తత్వచింతన మరింతగా అభివృద్ధి చెందడానికి ఇరు మతాలు దోహదపడ్డం. కర్మమార్గం యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పాయి. హేతువాదమునకు గట్టి పునాదులు వేశాయి. బౌద్ధంలో ఆచార్య నాగార్జునుడు ‘శూన్యవాదము’ను ప్రవేశపెట్టాడు. చివరకు ఇది తత్వచింతనలో గొప్ప వాదమైన శంకరాచార్యునియొక్క అద్వైత సిద్ధాంతమునకు మూలమైనది.
బౌద్ధ- జైనములు, బ్రాహ్మణ మతముతో ఉన్న పోలికలు, తేడాలు:
ఈ మతాల మధ్య తులనాత్మకమైన అధ్యయనం చేయడానికి ముందు ఇరు మతాలు బ్రాహ్మణ మతంనుంచే ఆవిర్భవించాయని గుర్తించాయి.
తేడాల పరంగా మతం మరియు తత్వచింతనలో ఇవి బ్రాహ్మణ మతంతో కొన్ని విషయాలలో విభేదించాయి.
1) బ్రాహ్మణ మతానికి ఆధారమైన వేదాలను ఇరు మతాలు వ్యతిరేకించాయి.
2) వేదమతంలోని యజ్ఞయాగాలు కర్మకాండలను ఇరుమతాలు నిరసించాయి.
3) వేద మతంపై బ్రాహ్మణాధిక్యతను ఇరుమతాలు ప్రశ్నించాయి.
4) మోక్షంను బ్రాహ్మణ మతము కేవలం అగ్రవర్ణాలకే పరిమితం చేయగా బౌద్ధ జైనములు అందరికీ అందుబాటులోకి తెచ్చాయి.
5) తత్వ పరంగా బ్రాహ్మణ మతం జ్ఞానమార్గమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా బౌద్ధ-జైనములు కర్మమార్గమునకు ప్రాధాన్యతను ఇచ్చాయి.
6) బ్రాహ్మణ మతంలోని మార్మికవాదంను వ్యతిరేకించి, ఇరుమతాలు హేతువాదమునకు ప్రాధాన్యత ఇచ్చాయి.
7) సామాజికపరంగా బ్రాహ్మణమతం ఆధిపత్య ధోరణికి కారణమయ్యే కులవ్యవస్థను పాటించగా, బౌద్ధ జైనములు కుల వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుటకు పూనుకున్నాయి.
8) బ్రాహ్మణ మతం పుట్టుటకు ప్రాధాన్యతనివ్వగా బౌద్ధజైనములు ప్రతిభనుబట్టి వ్యక్తిస్థాయిని గుర్తించాయి.
9) ఇరుమతాల మధ్య తేడాలు ఆర్థిక రంగంపై వీటి ఆలోచనా ధోరణిలోనూ కనబడతాయి. బ్రాహ్మణమతం తిరోగమన వాదంతో కూడిన నియమ నిబంధనలు అనగా సమగ్ర వ్యాపార నిషేధము, లాభాపేక్షను నిరసించడం పాటించినది. ఇందుకు వ్యతిరేకంగా బౌద్ధ జైనములు సముద్ర వ్యాపారమును, లాభాపేక్షను సమర్ధించాయి.

No comments:
Post a Comment