Thursday, June 16, 2011

డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్

పేపర్-5 డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్
సమయం: 3 గంటలు మార్కులు: 150
గ్రూప్-1 మెయిన్స్ విజయంలో పేపర్-5ది కీలక పాత్ర అనేది నిస్సందేహం. అంతేకాక ఈ పేపర్‌లో సాధించే అత్యల్ప, అత్యధిక మార్కుల మధ్య వ్యత్యాసం 70 నుంచి 80 మధ్యలో ఉంటుంది.

ముందుగా గణితంలో ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. మౌలికాంశాలైన.. సంఖ్యలు-సంఖ్యామానాలు;ప్రాథమిక గణిత పరిక్రియలు (+, – , ×, ¸); కారణాంకాలు, గుణిజాలు, క.సా.గు.; భిన్నాల కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారం, సాధారణ భిన్నం, మిశ్రమ భిన్నం;సమీకరణాలు-సాధన; ఘాతాంకాలు-ఘాతాలుపై అవగాహన సాధించాలి. ఇందుకు 6,8 తరగతి పుస్తకాలు పరిశీలించాలి.
ఈ అంశాలపై పట్టు సాధించాక వీలైనంత ప్రాక్టీస్ చేయాలి.
అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఒక మోడల్‌ను వివిధ పద్ధతుల్లో సాల్వ్ చేసే ప్రాక్టీస్ అవసరం.
సమస్యకు స్టెప్పుల వారీగా పరిష్కారం సూచించాలి. షార్ట్‌కట్స్ సరికాదు.

ఈ పేపర్‌లో ఛాయిస్ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాక ప్రాబ్లమ్ బేస్డ్ పరీక్ష కాబట్టి సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ సాగించాలి.

సెక్షన్-1లోని సగటు, నిష్పత్తి, శాతాలు. వీటిని ఉపయోగించి దత్తాంశాన్ని మదింపు చేయడం, అన్వయించడం; సెక్షన్-2లోని బొమ్మల రూపంలో ఇచ్చిన దత్తాంశాన్ని అన్వయించడం; సెక్షన్-3 లోని నంబర్ సిరీస్, కోడింగ్ - డీకోడింగ్, క్యాలెండరు, గడియారం వంటి అంశాలపై పట్టు సాధించాలి.

వ్యక్తిగత, సమూహపు శ్రేణులు, పౌనఃపున్య విభా జనాలకు సంబంధించి సగటు, మధ్యగతం, బాహుళకం, వ్యాప్తి, మాధ్యమ విచలనం, చతుర్థాంశ విచలనం, క్రమ విచలనం, విస్తృతి, విచలన గుణకం, కాలం-దూరం, కాలం-పని అంశాలను చదవాలి.

పట్టికలు, బార్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్, గ్రాఫ్స్ మొదలైన బొమ్మల రూపంలో ఇచ్చిన దత్తాంశాన్ని అన్వయించడంపై పట్టు సాధించాలి.

సగటు, నిష్పత్తి, శాతాల మౌలిక భావనలపై పట్టు ఉంటే సెక్షన్-2కు పునాదిగా తోడ్పడుతుంది. నంబర్ సిరీస్, నంబర్ అనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ అనాలజీలపై పట్టు సాధిస్తే కోడింగ్- డీకోడింగ్ ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వొచ్చు.

క్యాలెండరు, గడియారాలకు సంబంధించి మోడల్స్ పరిమితం. రక్త సంబంధాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్ సంబంధిత ప్రశ్నలను సులువుగా సాధించొచ్చు.

నిర్దిష్ట అంశం విశ్లేషణపై వర్గీకరణ, పోలిక, ఎంపిక, అరేంజ్‌మెంట్స్, దిక్కులను ప్రాక్టీస్ చేస్తే చాలు.

కాలిక్యులేషన్స్‌పై పట్టు అవసరం. సూత్రం, అన్వయ విధానం అంతా సరిగా ఉన్నప్పటికీ కాలిక్యులేషన్ లోపాల వల్ల సరైన సమాధానం రాకపోవచ్చు. కాబట్టి గణిత క్రియలపై పట్టు, కాలిక్యులేటర్ వినియోగంలో నేర్పు అలవర్చుకోవాలి.

ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మొత్తం సిలబస్‌ను రివిజన్ చేసుకోవాలి. అన్ని ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు ఇతర ముఖ్య అంశాల జాబితా రూపొందించుకుని వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి.

నిపుణుల పర్యవేక్షణలో కనీసం అయిదు మాక్ టెస్ట్‌లు రాయాలి. వాటిపై ఫీడ్ బ్యాక్ తీసుకుని అవగాహన స్థాయిని తెలుసుకోవాలి.

నిర్దిష్ట ప్రణాళికతో చదివితే ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టిన వారు కూడా పరీక్ష సమయానికి పట్టు సాధించొచ్చు. ఈ క్రమంలో ఆర్ట్స్ అభ్యర్థులు ముందుగా తెలుగు అకాడెమీ గణిత పుస్తకాలలోని ఫండమెంటల్స్‌ను రివైజ్ చేసుకోవడం ముఖ్యం.

అభ్యర్థులు చాలా కష్టంగా భావించేది సెక్షన్-1. దీనిని అధిగమించాలంటే సిలబస్‌లోని సంబంధిత కాన్సెప్ట్‌లను తెలుసుకోవాలి. అన్ని ఫార్ములాలు- అన్వయంపై పట్టు సాధించాలి. ఏపీపీఎస్సీ రిఫరెన్స్ పుస్తకాల్లోని ఉదాహరణలను, ఎక్సర్‌సైజ్ ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.

గత ఏడాది అడిగిన విభాగం నుంచి ప్రశ్నలు రావనే ఆలోచన పేపర్ 5కు ఆమోదయోగ్యం కాదు. ఛాయిస్ కూడా లేనందున అన్ని కాన్సెప్ట్‌ల నుంచి అంకెలు మార్చి ప్రశ్నలు అడగొచ్చు. 130 మార్కులు రావాలంటే ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి.

ఎక్స్‌పెక్టెడ్ కాన్సెప్ట్స్- ప్రాబ్లమ్స్:
జామెట్రిక్ మీన్ (జి.ఎం.)- పెరుగుదల లేదా తగ్గుదల సగటు రేటు అప్లికేషన్స్ ఆఫ్ హార్మోనిక్ మీన్- యావరేజ్ వెలాసిటీ, సగటు ధర, సగటు మైలేజి
అంక మధ్యమం, ప్రామాణిక విచలనాల కరెక్షన్
కంబైన్డ్ అర్థమెటిక్ మీన్, వాటి అప్లికేషన్స్
కన్‌స్ట్రక్షన్ ఆఫ్ టేబుల్స్‌కు సంబంధించి సివిల్స్ మెయిన్స్ గత ప్రశ్న పత్రాల్లో అడిగిన సమస్యలు
బేసిక్స్ ఆఫ్ యావరేజెస్, రేషియోస్, పర్సంటేజెస్ వాటి అప్లికేషన్స్
బైనరీ సిరీస్, నంబర్ అండ్ లెటర్ సిరీస్, రీజనింగ్ ప్యాసేజ్

రిఫరెన్స్ బుక్స్:
ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ - డి.ఎన్ ఎల్హాన్స్, వీనా ఎల్హాన్స్, బి.ఎం. అగర్వాల్ (కితాబ్ మహల్ పబ్లిషర్స్) ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ - ఎస్. సి. గుప్తా, వి.కె. కమూర్ అడ్వాన్స్‌డ్ అప్రోచ్ టు డేటా ఇంటర్‌ప్రిటేషన్ - ఆర్. ఎస్. అగర్వాల్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ జనరల్ స్టడీస్ - స్టాటిస్టిక్స్ గైడ్ - స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers