Monday, June 13, 2011

జనరల్ స్టడీస్ -మగధ ఆవిర్భావం



బ్రాహ్మణ మతం వృత్తిపరంగా అసమానతలు సృష్టించగా బౌద్ధ జైనములు ప్రతివృత్తిపట్ల సమానత్వాన్ని కనబరిచాయి. అనగా నీచ వృత్తులు అనే భావనను తొలగించాయి.
పరిశీలనాత్మకమైన దృష్టితో గమనిస్తే వీటిమధ్య పోలికలు కూడా కనబడతాయి.
* తత్వ చింతనలో బ్రాహ్మణ మతంలోని ఉపనిషత్తుల వాదమును ఇరుమతాలు అంగీకరించాయి.
* కర్మ మార్గము, పునర్జన్మ వాదము, వీటిని ఇరుమతాలు అంగీకరించాయి.
* దైవము ఉనికిపై కూడా బౌద్ధం వౌనాన్ని పాటించిందే కానీ వ్యతిరేకించలేదు. జైనము దేవుడు ఉన్నాడని ప్రకటించినది.
* మోక్షానికి మార్గాలు వేరయినప్పటికీ మోక్షం అనే భావనను ఇరు మతాలు అంగీకరించాయి.
* సామాజికపరముగా కుల వ్యవస్థలోని లోపాలను వ్యతిరేకించాయే కానీ కుల వ్యవస్థను కాదు.
మగధ ఆవిర్భావము
క్రీ.పూ. 6వ శతాబ్దంనాటికి షోడష మహాజన పదాలు అను 16 పెద్ద ప్రాదేశిక రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిలో మగధ భారతదేశ చరిత్రలోనే తొలి రాజ్యంగా ఆవిర్భవించింది. ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత బలమైన సామ్రాజ్యాన్ని ఏర్పరచినది. ఇందుకు అనేక పరిస్థితులు తోడ్పడతాయి.
ఏ సామ్రాజ్యం యొక్క మనుగడనైనా ఆ రాజ్యంయొక్క ప్రాదేశిక నైసర్గిక పరిస్థితులపై ఆధారపడి వుంటుంది. భౌగోళికంగా మగధకు ముందునుండి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి.
అత్యంత సారవంతమైన గంగ, యమున, అంతర్వేదిలో ఉండుటవలన మగధ సహజంగానే త్వరితగతిన వ్యవసాయాభివృద్ధికి నోచుకుంది. ఇనుము, రాగి వంటి ఖనిజ నిక్షేపాలు విస్తృతంగా లభించడంవలన పారిశ్రామికంగా ఊహించని ప్రగతి సాధించినది. మగధ తొలి రాజధాని ‘గిరివ్రెజ’ మరియు మలి రాజధాని ‘రాజగృహ, పాటలీపుత్రములు’ కొండల నడుమ నిర్మించబడి ఉండడంవలన మగధ శత్రువులకు దుర్బేధ్యమైనది. (మరియు సోనేరి నది తీరాన వున్నది).
అపారమైన అటవీ సంపదతోపాటు శత్రు శిబిరాలలో బీభత్సం సృష్టించగల్గాయి. గజబలం మగధలో విస్తృతంగా కేంద్రీకరించబడి వుండడం మగధను ఒక అజేయశక్తిగా చేసినది.
సరిహద్దులకు దూరంగా ఉండటంవల్ల ఇతర మహాజనపదాలు తరచుగా ఎదుర్కొన్న విదేశీ దాడుల సమస్య మగధకు లేకుండాపోయింది. భౌగోళిక అంశములతోపాటు రాజకీయపరమైన అంశములు కూడా మగధ ప్రాభవానికి తోడ్పడ్డాయి. ఇతర జనపదాలలోవలే కాక మగధ ప్రారం భం నుండి ‘వంశపారంపర్య రాచరిక వ్యవస్థ’ ఎంచుకుంది. ఫలితంగా పాలనాపరమైన సుస్థిరతకు నోచుకుంది.
ప్రారంభంనుండి గొప్ప సమర్ధులు మరియు సామ్రాజ్యవాదులైన పాలకులు బింబిసార, అజాతశత్రు, కాలాశోక మరియు మహాపద్మనందలు తమ సామ్రాజ్యవాదంతో మగధను బలోపేతం చేశారు.
మగధ సామ్రాజ్యవాదంలో భాగంగా మళ్ళ రాజ్యమును ఆక్రమించడం మగధకు బాగా అనుకూలించింది. గొప్ప పోరాట పటిమ కలిగిన మళ్ళలు మగధ సైన్యంలో కలవడం వలన సైనికంగా బలపడినది. ప్రారంభం నుండి వివిధ రంగాలలో నిష్ణాతులు మగధకు తమ సేవలను అందించారు. రాజనీతిలో అపారమైన అనుభవజ్ఞులు రాక్షస మరియు కౌటిల్యుడు మగధను బలోపేతం చేశారు. ఓటమి ఎరుగని సేనాని అస్సకర, అజాతశత్రువుకు సామ్రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు. గూఢచర్యములో నిష్ణాతుడైన పింగళకుడు, తొలి వైద్యుడైన జీవకుడు మగధకు చెందినవారైనారు.
మగధ బ్రాహ్మణ మతానికి దూరంగా కొనసాగడం కూడా మగధ ప్రాభవానికి దారితీసింది. మగధను పాలించిన వంశములు హర్యాంక, శిశునాగ, నంద, వౌర్యులు అభివృద్ధి నిరోధకమైన బ్రాహ్మణమతమును ఆదరించలేదు.
సాంస్కృతిక పరంగానూ మగధ మిగిలిన జనపదాల కంటే అభ్యుదయ వాదము మరియు పరోగమన వాదముతో కూడిన సంస్కృతిని అలవర్చుకుంది. మగధ ప్రజలు విద్యావంతులు, చైతన్యవంతులు కావడంవల్ల సహజంగానే బుద్ధుడు గానీ వర్ధమానుడు గానీ తమ భావాల వ్యాప్తికి మగధను కేంద్రంగా చేసుకున్నారు. ఇన్ని అంశాలు అనుకూలించడంవల్ల చరిత్రలో మగధ తొలి రాజ్యమయింది. ప్రాచీన భారతదేశ చరిత్ర మగధ చుట్టూ పరిభ్రమించినది.
మహాయాన అవతరణ
బౌద్ధంలో మహాయాన అవతరణ ఆచార్య నాగార్జునతో ప్రారంభమైంది. మహ పండితుడైన నాగార్జునుడు తన మాధ్యమిక సిద్ధాంత ఆధారంగా మహాయానాన్ని రూపొందించాడు. శ్రీనగర్‌లోని కుందలవనంలో జరిగిన 4వ భౌద్ధ సమావేశంలో మహాయానం వెలుగులోకి వచ్చింది. బౌద్ధం మహయానం, హీనయాన అనుశాఖలుగా విడిపోయింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers