Tuesday, June 14, 2011

జనరల్ స్టడీస్ - వ్యాధులు - అధ్యయనం

వైరస్ వ్యాధులు
వైరస్ ద్వారా ఈ క్రింది వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో కొన్ని లైంగిక సంబంధాల ద్వారాను, గాలి ద్వారాను, కలుషిత నీరు- ఆహారం తీసుకొనుట ద్వారాను మరియు వివిధ రకాలైన దోమలు ద్వారాను వ్యాప్తిచెందుతాయి.
1.ఎయిడ్స్ 2. సార్స్ 3. బర్డ్ ఫ్లూ 4. స్వైన్‌ఫ్లూ 5. గవద బిళ్లలు 6. తట్టు 7. మశూచి/ స్ఫోటకం 8. అమ్మవారు/ ఆటలమ్మ 9.జలుబు 10. మెదడువాపు వ్యాధి 11. చికూన్‌గున్యా 12. డెంగ్యూ 13. పోలియో 14. హెపటైటిస్ 15. కౌపాక్స్ 16. రుబెకా.
ఎయిడ్స్
* వ్యాధికారకం - హెచ్‌ఐవి వైరస్.
* ఇది లైంగిక సంబంధాలు, రక్త మరియు అవయవ మార్పిడులు, కలుషిత సూదులు, సిరంజులు వంటి వైద్యపరికరాలు మరియు తల్లినుండి బిడ్డకు సంక్రమిస్తుంది.
* ఇది ముఖ్యంగా తల్లిపాల ద్వారా, రక్తం, వీర్యం మరియు యోని స్రవాల ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* ఈ వ్యాధి సోకిన వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి క్షీణించి పోతుంది. శరీర బరువు తగ్గి, శోషరస గ్రంథులు ఉబ్బుతాయి. అనుకోని జ్వరం, చర్మంపై పొక్కులు, రాత్రిపూట విపరీతంగా చెమట పడుతుంది.
వ్యాధి నిరోధకశక్తి క్షీణించుటవల్ల అనేక రకాల వ్యాధులకు గురై చివరికి మరణం సంభవిస్తుంది.
* సురక్షిత లైంగిక పద్ధతులు, లైంగిక నైతికత పాటించడం, శాస్ర్తియంగా పరీక్షలు జరిపాకే రక్తం మరియు అవయవ మార్పిడి జరపడం, స్టెరిలైజ్ చేసిన లేదా డిస్పోజబుల్ సూదులు, సిరంజులను వాడడం ప్రసవ సమయంలో శాస్ర్తియ విధానంలో తల్లినుండి బిడ్డను వేరుచేయడం వంటివి పాటించుట ద్వారా నివారించవచ్చు.
* ఎలీసా, వెస్ట్రన్ బ్లాటింగ్‌టెస్ట్, పిసిఆర్ పరీక్షలద్వారా దీనిని నిర్ధారించవచ్చు.
* యాంటి రిట్రోవైరో థెరపివల్ల వైరస్ వృద్ధిచెందకుండా నివారించుట జరుగుతుంది.
* ఆజిడోథైమిడిన్/ జిడోఉడిన్
డై ఓఆక్సీ- అయనోసిన్
డై ఓ ఆక్సీ- సైటిడిన్
జాల్సీటాబ్ ఇన్
టిఆర్‌ఇ: టి.20 వంటి మందులు ఉపయోగించి వైరస్ లోడ్ పెరగకుండా చూస్తారు.
సార్స్
* ఇది కరోనా వైరస్ ద్వారా కలిగే శ్వాస సంబంధ వ్యాధి.
* జంతువులకూ, పక్షులకు, ఏనుగు పిల్లలకుకూడా కలుగుతుంది.
* రోగి నుండి వెలువడు దగ్గు, ఉమ్మి, తుమ్ము తుంపరల నుండి వచ్చు గాలి పీల్చుకొనుట ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* పొడి దగ్గు, తీవ్ర జ్వరం, ఛాతి - గొంతు నొప్పి, కండరాల నొప్పులతోపాటు ఫ్లూ మరియు న్యుమోనియా లక్షణాలు కన్పిస్తాయి.
* వ్యాధి తీవ్రమయ్యేకొద్ది వాంతులు, విరోచనాలు అధికమై ఊపిరితిత్తులు కలుషితమై ప్రాణాంతకంగా మారుతుంది.
* నిర్దిష్ట మందులు, చికిత్సా విధానం లేనప్పటికీ యాంటీవైరల్ మరియు స్టెరాయిడ్స్‌ను వాడి కొంతవరకు అదుపు చేయగలుగుతున్నారు.
* వ్యాధి సోకిన రోగికి దూరంగా ఉండుట, మాస్కులు ధరించుట ద్వారా వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
బర్డ్ఫ్లూ
వైరస్ ద్వారా వచ్చే వ్యాధుల్లో ఇది ఒకటి.
స్వైన్‌ఫ్లూ
* ఇది హెచ్1 ఎన్1 అనే వైరస్ ద్వారా కలుగుతుంది. సాధారణంగా పందులకు సోకే శ్వాసకోశ వ్యాధి. ఇది టైప్‌‘ఎ’ ఇన్‌ఫ్లూయంజా వైరస్‌వల్ల వస్తుంది. సాధారణంగా మనుష్యులకు సంక్రమించే వ్యాధికాదు.
* స్వైన్, మనిషి, బర్డ్ఫ్లూ జన్యువుల కలయికతో ఈ కొత్త హెచ్1ఎన్1 వైరస్ ఏర్పడింది. ఇది పందులకు సంక్రమించిన 2రకాల ఫ్లూ వైరస్‌ల నుండి ఉద్భవించింది.
* ఇది గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి.
* స్వైన్‌ఫ్లూ వైరస్ సోకిన ఒకరోజు తరువాత జలుబు, తల నొప్పి, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వర లక్షణాలు వంటి సాధారణ వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి.
(రోగ నిరోధకశక్తి బాగా ఉన్నవారిలో 2 రోజుల వరకు లక్షణాల తీవ్రత కన్పించదు).
* వైద్యసేవల విషయంలో నిర్లక్ష్యంచేస్తే ఎనిమిది రోజుల తర్వాత ఊపిరి తిత్తుల్లోకి నీరు వెళ్లి ‘న్యుమోనియా’ వచ్చే అవకాశం ఉంది.
* న్యుమోనియా తీవ్ర స్థాయికి చేరుకుని రోగి కోమాలోకి వెళితే వెంటిలేటర్‌పై ఉంచాలి.
* తరువాత వైరస్ శరీరంలోని అన్ని అవయవాలను వరుసగా పనిచేయకుండా చేస్తుంది. చివరకు మరణం సంభవిస్తుంది.
* ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రభుత్వ ప్రత్యేక గుర్తింపు పొందిన కేంద్రానికి వెళ్ళి నిపుణులను సంప్రదించాలి. ప్రత్యేక గదుల్లో చికిత్స అందించాలి.
* రోగి లక్షణాలను దృష్టిలో ఉంచుకొని బసార్టిమివిర్ మందు బిళ్లలతోపాటు ప్రత్యేక చికిత్సలు అందిస్తారు. బలవర్ధక ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే 10రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గిపోయి స్వస్థత చేకూరుతుంది. ఇటువంటి సీజనల్ ఫ్లూవ్యాధుల అదుపునకు తామీఫ్లూ, రెలెంజాల అనే మందులను వాడతారు.
* ఎన్-95 మాస్కులు, 3 పొరల సర్జికల్ మాస్కులను ధరించాలి.
* గవద బిళ్ళలు-
* పారామిక్సో వైరస్ నుంచి కలుగుతుంది.
* లాలాజలం మరియు ముక్కు స్రవాలలో క్రిములు చేరడంవల్ల కలుగుతుంది. రోగితో ప్రత్యక్ష సంబంధం, సంక్రమిక క్రిములు గల గాలిని పీల్చుట ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, జలుబు వంటి లక్షణాలతో ప్రారంభమై గొంతు నొప్పి, దవడ కండరాలు బిగుసుకుపోవడం, నోరు తెరవకపోవడం లాలాజలం గ్రంథులు ఉబ్బడం వంటి లక్షణాలు కనపడతాయి.
* ఆహారం తీసుకోలేని స్థితి, ఆహారం రుచించకపోవడం వంటి లక్షణాలు.
* ఒక్కోసారి ఈ క్రిములు దాడిచేయుటవల్ల ప్రమాదకర పరిస్థితి ఏర్పడి మరణానికి దారితీస్తుంది.
* రోగులకు ద్రవ ఆహారం ఇవ్వడం మంచిది.
* యాంటి బయాటిక్ మందులు వాడడం, పరిశుభ్రత పాటించాలి.
తట్టు-
* ఇది ‘పారామిక్సో వైరస్’వల్ల కలుగుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, జలుబు వంటి వాటితో మొదలై చర్మంపై రాషెస్ ఏర్పడి, మచ్చలు ఏర్పడి ఇవి ఎండి రాలిపోయి పెద్ద గుంటలు ఏర్పడతాయి.
* కళ్ళు మంటలు, కాంతిని చూడలేకపోవడం జరుగుతుంది.
* ఊపిరితిత్తులు ప్రభావానికి లోనై న్యుమోనియా లక్షణాలు కన్పిస్తాయి.
* ఎంఎంఆర్ వాక్సిన్, యాంటిబయాటిక్ మందులు వాడి రక్షణ పొందవచ్చు.
* పరిశుభ్రత పాటించడం, రోగికి దూరంగా ఉండడం, మాస్కులను ధరించుట ద్వారా వ్యాప్తిచెందకుండా ఉంటుంది.
మశూచి/ స్ఫోటకం
* ఇది ‘వేరియోలా వైరస్’ ద్వారా కలుగుతుంది.
* గాలి ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కన్పిస్తాయి. మూడు రోజులకు చర్మంపై రాషెస్ ఏర్పడి, ఎర్రటి బొబ్బలుగా మారి, ఎండిపోయి పొక్కుకట్టి రాలిపోవడంవల్ల చిన్న గుంటలు ఏర్పడతాయి.
* మశూచి టీకాలు, యాంటిబయాటిక్ మందులు తీసుకొనుట ద్వారా పరిశుభ్రత పాటించడం, మాస్కులను ధరించుట వంటి జాగ్రత్తలు తీసుకొనుట ద్వారా నివారించవచ్చు.
* ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ధృవీకరించింది.
అమ్మవారు/ఆటలమ్మ-
* వెర్సిల్లా వైరస్ ద్వారా కలుగుతుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్ళునొప్పులతో ప్రారంభమై శరీరంపై మచ్చలు ఏర్పడి 36 గం.లలో నీటితో నిండిన బొబ్బలు ఏర్పడతాయి.
* 5-20 రోజులలో ఇవి ఎండిపోయి పొక్కులు రాలిపోతాయి.
* టీకాలు, యాంటి బయాటిక్ మందులు తీసుకొనుట ద్వారా, పరిశుభ్రత పాటించడం, రోగిని ప్రత్యేకంగా ఉంచుట, మాస్కులు ధరించుట ద్వారా నివారించవచ్చు.
సాధారణ జలుబు-
* ‘రినోవైరస్’ ద్వారా కలుగుతుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. క్రిములవల్ల ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు కలుషితమై, నాసికా స్రవాలు స్రవించడం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళునొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. యాంటిబయాటిక్స్ వాడి, విశ్రాంతి తీసుకొనుట ద్వారా నివారించబడుతుంది.
మెదడువాపు వ్యాధి, చికూన్‌గున్యా వ్యాధులు వైరస్ ద్వారా వస్తాయి.
డెంగ్యూ-
* ఆర్బవైరస్‌ద్వారా సంక్రమిస్తుంది. శరీర ద్రవాలకు సంబంధించిన వ్యాధి. ఎడిన్ ఈజిప్షియా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని పొదగబడు దశ 2-3రోజులు.
* జ్వరం, తలనొప్పి, ఒళ్ళునొప్పులు నీరసం కలుగుతాయి. విష పదార్థాలు విడుదల కావడంవల్ల శరీర ద్రవాలు విషతుల్యం అవుతాయి.
* రక్తం కలుషితమై రక్త్ఫలికలు విచ్ఛిన్నమవుతాయి. తద్వారా హీమోఫీలియా లక్షణాలు కనపడతాయి. వాంతులు, విరోచనాలు కలుగుతాయి.
* మూత్ర పిండాలు విఫలం కావడంవల్ల మరణం సంభవిస్తుంది. ప్రత్యేక మందులు, చికిత్సా విధానంగాని లేదు. టీకాలుకూడా లేవు. సాధారణ వైరస్ వ్యాధులకు వాడినవే ఉపయోగిస్తారు. దోమల నివారణే ప్రధాన నివారణ.
పోలియో-
* ఇది ‘పోలియో మైలిటిస్’ వైరస్ ద్వారా కలుగుతుంది. దీనిని ‘ఏంటిరో వైరస్’ అని కూడా అంటారు. కలుషిత నీరు- ఆహారం తీసుకొనుట ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా కాలు, చేయి, కండరాలు కదల్చలేక పక్షవాతం కలుగుతుంది. ఇది పిల్లల్లో ఎక్కువగా కన్పించుటవల్ల ‘శిశు పక్షవాతం’ అంటారు. పోలియో టీకాలు, యాంటిబయాటిక్ మందులు, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకోనుట ద్వారానూ, పరిశుభ్రత పాటించి శుభ్రమైన ఆహారం- నీరు తీసుకొనుట ద్వారా నివారించవచ్చు.
హెపటైటిస్-
* హెపటైటిస్ వైరస్ ద్వారా కలుగుతుంది. ఇది కాలేయ సంబంధ వ్యాధి. కలుషిత నీరు- ఆహారం తీసుకొనుట ద్వారా వ్యాప్తిచెందుతుంది. కాలేయ కణాలు విచ్ఛిన్నమై, జాండిస్, సిర్‌హోసిస్ అనే వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. దీనివల్ల జ్వరం, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలతోపాటు శరీర ద్రవాలు విషతుల్యమై మరణం సంభవించవచ్చు. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ హెపటైటిస్-బి ప్రమాదకరమైనది. షాన్‌వి-బి, రికంబివాక్స్-హెచ్‌బి, ట్రిటాన్‌ట్రిక్స్-హెచ్‌బి అనే పేర్లతో హెపటైటిస్-బి వాక్సిన్‌లు విక్రయించబడుతున్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Followers