పేపర్ - 4 సైన్స్ అండ్ టెక్నాలజీ
సమయం: 3 గంటలు మార్కులు: 150
మూడు సెక్షన్ల సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి.
ప్రతి సెక్షన్‌లోని అన్ని అంశాలు- వాటి పరిధి- గత పరీక్షల్లో ప్రశ్నల సరళి - ప్రశ్నలు ఏ కోణాల్లో అడిగే అవకాశం ఉంది- అనే అంశాలపై అధ్యయనం చేయాలి.
ఉదా: మొదటి సెక్షన్; రెండో యూనిట్ భారత అంతరిక్ష కార్యక్రమం. ప్రస్తుతం ఉన్న ఇస్రో కార్యక్రమాల దృష్ట్యా దీన్ని చదవాలి. ఇటీవల ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ- సీ12, పీఎస్‌ఎల్‌వీ-సీ 14, పీఎస్‌ఎల్‌వీ-సీ 15, పీఎస్‌ఎల్‌వీ-సీ 16 ప్రయోగాలు, జీఎస్‌ఎల్‌వీ-03, జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 06 వైఫల్యాలు, చంద్రయాన్-1, జీశాట్-8 ప్రయోగాల అంశాలను బాగా చదవాలి. జూన్-జూలైలో పీఎస్‌ఎల్‌వీ-సీ 17ను ఇస్రో ప్రయోగించనుంది. అది అమలైతే దాని వివరాలు కూడా అవసరం.
కొన్ని యూనిట్ల పరిధి తక్కువ. మరికొన్నిటి పరిధి ఎ క్కువ.దీని ప్రకారం సిలబస్ అర్థం చేసుకుని చదవాలి. ఏ యూనిట్‌ను వదలకుండా వాటి ప్రాధాన్యత ఆధారంగా చదవాలి. ఇక్కడ ఛాయిస్ లేదు. మూడో సెక్షన్‌లోని నాలుగో యూనిట్‌లో ఈసారి ఘనవ్యర్థ పదార్థంపై అధికంగా దృష్టి సారించాలి.
ముందుగా మౌలిక భావనలను అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్‌పై స్పష్టత లేకుండా ప్రశ్నలకు సమాధానం రాయడం సరికాదు. ఉదాహరణ జన్యు ఇంజనీరింగ్ టాపిక్‌లో జన్యువు, డీఎన్‌ఏ, రిప్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్‌లు, ఎలక్ట్రోఫోరిసిస్, సథరన్ బ్లాటింగ్‌పై కనీస అవగాహన ఉంటే సమాధానంలో స్పష్టత ఉంటుంది.
చాలా మంది మూడు గంటల్లో 15 ప్రశ్నలకు జవాబివ్వడంలో ఇబ్బంది పడుతున్నారు. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా, ప్రశ్నలో అడిగిన అంశాల ఆధారంగా పది నిమిషాల్లో జవాబు రాసేలా సాధన చేయాలి. టూకీ పద్ధతిని అవలంభించాలి. ఉదా: గ్లోబల్ వార్మింగ్ గురించి రాయాల్సివస్తే.. దాని ప్రభావాలు చాలా ఉన్నాయి. అయితే సంక్షిప్తంగా సమాధానం రాసేటప్పుడు చిన్న చిన్న వాక్యాల్లో రాయాలి.
ప్రశ్నల సరళి అంశాన్ని బట్టి మారుతుంది. ఉదా: చంద్రయాన్-1 ప్రయోగ విశేషాలను చర్చించండి? అని అడగటం వేరు... చంద్రయాన్-1 ప్రాధాన్యత, సాధించిన ఫలితాలు, గడువుకు ముందే కార్యక్రమం ముగియడానికి కారణాలు? అని అడగడం వేరు. రెండో ప్రశ్నకు ప్రత్యేక సమాధానం రాయాలి.
ఎస్ అండ్ టికి సంబంధించి గత మెయిన్స్ జనరల్ ఎస్సే (పేపర్-1)లో కరువు, పీఎస్‌ఎల్‌వీ-సీ 9, ఇండో-అమెరికా అణు ఒప్పందం అంశాలు అడిగారు. ఈసారి చంద్రయాన్-1, వ్యవసాయ సంక్షోభం, శక్తి భద్రత, ఇంధన వనరులు, వరదలు- దుర్భిక్షం, విపత్తు నిర్వహణ, ప్రపంచ శీతోష్ణస్థితిలో మార్పులు, ఈ-గవర్నెన్స్‌పై జనరల్ ఎస్సేలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎస్ అండ్ టి పరిధిలోని ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ జనరల్ ఎస్సేకు ఉపయుక్తం.
మూడో సెక్షన్‌లోని ఎన్విరాన్‌మెంటల్ అంశాల కోసం ప్రపంచ, భారత పర్యావరణ సమస్యలపై ఎక్కువ దృష్టి సారించాలి. ఆవరణ వ్యవస్థలపైనా పట్టు సాధించాలి. సిలబస్‌లో కొన్ని అంశాలను పేర్కొనకపోయినా ప్రశ్నలు అడగొచ్చు. ఉదా. ఫుడ్ చైన్స్ గురించి సిలబస్‌లో ఉంది. కానీ అభ్యర్థులు ఫుడ్ వెబ్స్ గురించి తెలుసుకోవడం మంచిది. బయో డైవర్సిటీకి సంబంధించి భారత్ దృక్కోణంలో ఎక్కువ చదవాలి. సమాధానాలు రాసేటప్పుడు అవసరమైన వాటికి డయాగ్రమ్స్ రూపంలో ఇస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. (ఉదా: ఫుడ్ చెయిన్)
యూజ్‌పుల్ బుక్స్:
హిందూ, ఎన్విరాన్‌మెంటల్ జర్నల్స్, ఇండియా ఇయర్ బుక్, ఇంటర్మీడియెట్, డిగ్రీ జువాలజీ, బోటనీ, మైక్రో బయాలజీ పుస్తకాల్లోని ప్రాథమికాంశాలు
ఎకాలజీ రిఫరెన్స్ బుక్స్:
పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్- కౌశిక్ అండ్ కౌశిక్
ఎకాలజీ - ఓడమ్
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ - పురోహిత్ అండ్ అగర్వాల్
పర్యావరణ అధ్యయనం - తెలుగు అకాడెమీ డిగ్రీ ద్వితీయ సంవత్సరం
ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్:
అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్‌ఎల్‌వీ ప్రాధాన్యత?
బయోటెక్నాలజీలోని వివిధ విభాగాలు, మానవాళికి చేకూరే ప్రయోజనాలు?
బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లు అనగానేమి? బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ భావన అభివృద్ధి, పరిరక్షణలో వాటి పాత్ర గురించి రాయండి?
భారత్‌లో అణుశక్తి కార్యక్రమం, అభివృద్ధి అనువర్తనాలు గురించి రాయండి?

No comments:
Post a Comment